ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదే... ఎర్రబెల్లి ధీమా... 

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదే... ఎర్రబెల్లి ధీమా... 

వరంగల్ కి వరదలు వచ్చినపుడు రావాలని అనేకమార్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరామని, కానీ అయన పట్టించుకోలేదని, ఇప్పుడు రాజకీయ లబ్దికోసం వరంగల్ కి వచ్చారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.  కేఎంసిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి నిధులు విడుదల చేయడంలో కేంద్రం జాప్యం చేసిందని, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకముందే కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వచ్చిందని అన్నారు.  ఇప్పుడు రాజకీయ లబ్ధికోసమే కేఎంసీ నిధుల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని జాతీయ రహదారులు దుర్భరంగా ఉన్నాయని, పట్టించుకోవడం లేదని అన్నారు.  గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు వరంగల్ వచ్చారని అన్నారు.  

గిరిజన యూనివర్శిటీ జాడ లేదని, టెక్స్ టైల్ పార్క్ నిర్మాణానికి సహకరించలేదని అన్నారు.  రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.  కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కి తీసుకెళ్లారని అన్నారు.  బీజేపీ నేతలు వరంగల్ లో చిచ్చుపెట్టొద్దని, రాజకీయ పబ్బం కోసమే కిషన్ రెడ్డి వరంగల్ కి వచ్చారని అన్నారు.  కనీసం కరోనా సమయంలో కూడా బీజేపీ నేతలు వరంగల్ ఎంజీఎంను సందర్శించలేదని, 1000 స్థంబాల  గుడి నిర్మాణం పనులకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ఎర్రబెల్లి ప్రశ్నించారు.  హైదరాబాద్ వేరు వరంగల్ వేరు అని, వరంగల్ ప్రజలు వివేకవంతులు అని, వరంగల్ లో జరిగే ఎన్నికలు ఏ కాలంలో జరిగినా వన్ సైడ్ ఎన్నికలే జరుగుతాయని, తమకు పోటీనే లేదని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు.