ఆర్టీసీ సమ్మెపై సంచలన కీలక వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి

ఆర్టీసీ సమ్మెపై సంచలన కీలక వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి

ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు తప్పుతెలుసుకుని ప్రభుత్వానికి సరెండర్ కావాలని ఆయన హెచ్చరించారు. యూనియన్ నాయకులను కార్మికులు నమ్మవద్దని ఎర్రబెల్లి  కోరారు. ఆర్టీసీ పరిస్థితికి కాంగ్రెస్, బీజేపీ వైఖరే కారణమని మంత్రి ఆరోపించారు. పండుగ వేళ ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. యూనియన్ నాయకులకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్, బీజేపీలకు సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా ఆర్టీసీని విలీనం చేశారా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రాలు తమ స్వార్థం కోసం ఆర్టీసీ సమ్మెను ఉపయోగించుకుంటున్నాయని మండిపడ్డారు. ఈ విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. దేశం మొత్తంలో ఆర్టీసీ ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇస్తోంది తెలంగాణ రాష్ట్రమేనన్నారు.