బీజేపీ దాడి ఇది 4వ సారి: మంత్రి దయాకర్ రావు

బీజేపీ దాడి ఇది 4వ సారి: మంత్రి దయాకర్ రావు

పరకాల ఎమ్మెల్యే ధర్మ రెడ్డి ఇంటి పైన దాడి ఘటన పైన టిఆర్ఎస్ నేత, మంత్రి దయాకర్ రావు ఖండించారు. ఈమేరకు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ దాడి ఇది 4వ సారి అని గుర్తుచేశారు. వినయ్ భాస్కర్ పైనా.. పరకాల సీఐ పైన.. యూనివర్సిటీలో నాపైన దాడి..  ధర్మ రెడ్డి ఇంటిపైన రాళ్ళ దాడి చేశారు. పోలీసులు కర్రలు లాక్కొని దాడి చేశారు. రావు పద్మ.. రాకేష్ రెడ్డి.  కొండేటి శ్రీధర్ దాడి చేశారు. బీజేపీ కండువాలు వేసుకొని దాడి చేశారు. మేము తలచుకుంటే ఉరికిచ్చి కొడుతాం. కేంద్ర బీజేపీ నేతలను డిమాండ్ చేస్తున్నము రాష్ట్ర నేతలు నోర్లు మూయిస్తారా లేక.. మేము దాడులు చేయాలా అంటూ దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ధర్మ రెడ్డి ఏమి మాట్లాడాడు లెక్కలు చెప్పు అని అడగడం తప్పా.. మేము రాముడి కోసం నిధులు ఇస్తున్నాం. ఈ సంఘటన ను వదిలి పెట్టడము లేదు. దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నాం.. ఇంట్లో ఎమ్మెల్యే ధర్మ రెడ్డి భార్య ఉంది పిల్లలు ఉన్నారు.  అయిన రావుల పద్మ కొట్టు కొట్టు అంటున్నారట.  ఇది సరైందా..? అంటూ మంత్రి దయాకర్ రావు ప్రశ్నించారు. 

టిఆర్ఎస్ నేత కడియం శ్రీహరి స్పందిస్తూ.. ధర్మ రెడ్డి లేని సమయంలో ఆయన ఇంటి పైన దాడి చేసి తీరును కండిస్తున్నాం.. కేంద్రలో అధికారంలో ఉన్న పార్టీ  వీధి గుండాల ప్రవర్తిస్తున్న తీరు సరైంది కాదు. రాముడికి టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు.. టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు విరాళాలు ఇస్తున్నారు. వి.హెచ్.పి. వాళ్ళు.. వి.హెచ్.పి. వాళ్ళకే ఇవ్వాలి అని ప్రకటన చేశారు.. రామాలయం నిర్మాణం వి.హెచ్.పి. ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుంది అని స్పష్టం చేశారు.  దాన్ని ఉద్దేశించి బీజేపీ వాళ్ళు చందాలు వసూల్ చేస్తున్నారు అని అన్నారు అందులో తప్పు ఎక్కడ ఉంది. పోలీసులు వైఫల్యం స్పష్టంగా ఉంది.  బీజేపీ నేతలు ధర్మ రెడ్డి ఇంటికి వస్తున్నారు అనే సమాచారం తెలిసిన పోలీసు సరైన చర్యలు తీసుకోలేదు. ఈ దాడి గేమ్ ప్లాన్ లా ఉంది. దాడి చేసిన తర్వాత కేసులు పెడితే రాష్ట్ర నాయకులు వచ్చి ఏదో హడాహుడి చేసేలా గేమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇది సరైంది కాదు. చట్టపరమైన చర్యలు ఉంటాయి.. మేము ప్రభుత్వంలో ఉండడంతో సమన్వయం పాటించాల్సి వస్తుంది. ప్రభుత్వంలో లేకపోతే వేరేలా ఉంటుంది మా సమన్వయాని బలహీనతగా భవించవద్దు’ అంటూ కడియం శ్రీహరి తెలిపారు.