'మిషన్‌ భగీరథకు కేంద్ర సాయం కావాలి'

'మిషన్‌ భగీరథకు కేంద్ర సాయం కావాలి'

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సాయం అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. ప్రాజెక్టు వ్యయంలో సగం ఖర్చును కేంద్రం ఆర్థిక సహాయంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్‌ నిర్వహణపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షేకావత్‌ అధ్యక్షతన ఇవాళ సదస్సు జరిగింది.  అన్ని రాష్ర్టాల గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రులు, అధికారులు హాజరైన ఈ సదస్సులో తెలంగాణ తరఫున మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. 

ఈ సమావేశం అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ మిషన్‌ భగీరథను అన్ని రాష్ర్టాల అధికారులు ప్రశంసించిన విషయాన్ని కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. రూ. 45 వేల కోట్లతో మిషన్‌ భగీరథ పథకం ప్రవేశ పెట్టామని గుర్తు చేసిన ఆయన.. ఈ పథకం ద్వారా వేసవిలో కూడా తాగునీటి కొరత లేకుండా చేయగలిగామని పేర్కొన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు భారీగా ఖర్చు చేయడంతో రాష్ట్రానికి రుణభారం ఏర్పడిందరి.. అందుకే కేంద్రం సహకారం అందించాలని కోరామన్నారు.