కాశ్మీర్‌ వ్యాలీలో ఈయూ సభ్యుల పర్యటన

కాశ్మీర్‌ వ్యాలీలో ఈయూ సభ్యుల పర్యటన


యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్యులు కాశ్మీర్‌ వ్యాలిని సందర్శించనున్నారురు. వారిని స్వయంగా స్వాగతం పలికిన  ప్రధాని మోడీ కశ్మీర్‌ లో ప్రస్తుత పరిస్థితలను వారికి వివరించారు. ద్వైపాక్షిక సంభందాలతో పాటు ట్రేడ్ ఇన్వెష్ట్‌మెంట్ కు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. అంతర్జాతీయంగా టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మోడీ వారికి సూచించారు. అంతే కాదు టెర్రరిస్టులకు సహకరిస్తున్న దేశాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని యూరోపియన్ యూనియన్ సభ్యులకు కోరారు మోడి.

ఇక ఈ బృందం రేపు జమ్మూలో పర్యటించనుంది. అలాగే ఈ బృందం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితోనూ భేటీ కానుంది. జమ్మూకశ్మీర్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాలని భావిస్తున్న ఎంపీల పర్యటన ఫలప్రదం కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించినట్లు పీఎంవో కార్యాలయం తెలిపింది. దేశ సంస్కృతి, సంప్రదాయాలను వారు అర్థం చేసుకోవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని అన్నారు. ఈయూ ప్రతినిధుల బృందం పర్యటనపై వచ్చిన వార్తలపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. స్థానిక ప్రజలు, స్థానిక మీడియా, డాక్టర్లతో ఈ బృందం కలిసి మాట్లాడుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.