భవిష్యత్తులోనూ యూరోప్ లో వడగాడ్పులు తప్పవు

భవిష్యత్తులోనూ యూరోప్ లో వడగాడ్పులు తప్పవు

ఈ ఏడాది యూరప్ భగభగ మండిపోతోంది. ఈ సంవత్సరం యూరప్ లో అత్యంత వేడిమి నమోదైంది. 2015-2019 ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఐదేళ్ల కాలంగా రికార్డులకెక్కింది. ఇది భవిష్యత్తులోనూ కొనసాగనుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యుఎంవో) శుక్రవారం తెలిపింది. ప్రస్తుతం ఐరోపాని మంటెక్కిస్తున్న వడగాడ్పులను వాతావరణ మార్పులకు ముడిపెట్టడం తొందరపాటే కావచ్చు. కానీ కచ్చితమైన స్థిరత్వంతో విపరీత వాతావరణం చోటు చేసుకోవడం, ప్రతి ఏడాదీ 'వడగాడ్పులు మరింత తీవ్రతతో ఉండటం, ఎక్కువ కాలం కొనసాగడం, త్వరగా ప్రారంభమై ఆలస్యంగా ముగియడం వంటివి చూస్తుంటే యూరప్ లో ఈ పరిస్థితి భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశాలు ఉన్నాయని' డబ్ల్యుఎంవో ప్రతినిధి క్లేర్ నల్లిస్ జెనీవాలో చెప్పారు.