సమంత నటనకు అందరూ ఫ్లాట్ !

సమంత నటనకు అందరూ ఫ్లాట్ !

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు కాకుండా కథా బలమున్న సినిమాలనే చదూకుంటూ ముందుకెళుతోంది.  మొదట్లో ఈ డెషిషన్ అంత ఉత్తమమైంది కాదని అన్నవారే ఇప్పుడు ఆమె చేస్తునం సినిమాలు చూసి చప్పట్లు కొడుతున్నారు.  ఇప్పటికే 'యు టర్న్, రాజుగారి గది 2' వంటి భిన్నమైన సినిమాలు చేసిన ఆమె కొత్తగా చేసిన చిత్రం 'సూపర్ డీలక్స్'.  

ఇందులో సామ్ పాత్ర నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది.  ఈరోజే సినిమా విడుదలైంది.  సినిమాలో సమంత పెర్ఫార్మెన్స్ చూసిన ప్రేక్షకులు, విమర్శకులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.  సమంత పాత్రలో గొప్ప నటన కనబరచిందని అంటున్నారు.  ఇకపోతే సామ్ ప్రస్తుతం నందిని రెడ్డి డైరెక్షన్లో 'ఓహ్ బేబీ' అనే సినిమా చేస్తోంది.