'సాహో'లో అంతా సరిగ్గానే జరుగుతోంది !

'సాహో'లో అంతా సరిగ్గానే జరుగుతోంది !

 

ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'సాహో' చిత్రీకరణ చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పట్ల ప్రభాస్ సంతృప్తికరంగా లేరని, అందుకే రీషూట్ జరుగుతోందని కొన్నిరోజులుగా వార్తలు పుట్టుకొచ్చాయి.   దీంతో అభిమానులు సినిమా ఫలితం పట్ల కొంత కంగారుపడ్డారు.  కానీ చిత్ర యూనిట్ స్పందిస్తూ రీషూట్ లాంటివేవీ జరగడంలేదని, అంతా సక్రమంగానే జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు.  సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆగష్టు 15న విడుదలచేయనున్నారు.  ఇందులో బాలీవుడ్ నటి శ్రద్ద కపూర్ కథానాయకిగా నటిస్తోంది.