పక్కాగా జరగనున్న చంద్రయాన్-2 రీ లాంచ్

పక్కాగా జరగనున్న చంద్రయాన్-2 రీ లాంచ్

ఈ నెల 15వ తేదీనాడే చంద్రయాన్-2 ప్రయోగం జరగాల్సింది.  కానీ సాంకేతిక కారణాల రీత్యా ఇంకో 56 నిముషాలు ఉందనగా లాంచ్ ఆగిపోయింది.  దీన్నొక పెద్ద సవాల్ కింద తీసుకున్న ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ అతి తక్కువ సమయంలోనే సాంకేతిక లోపాల్ని సరిచేసి రీ లాంచ్ చేపట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. 

ఈ నెల 22 అనగా రేపు మధ్యాహ్నం 2.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.  ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం అవుతుంది.  20 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక  చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని రోదసిలోకి తీసుకెళుతుంది.  ప్రయోగాన్ని వీక్షించేందుకు రాబోయే వీక్షకుల కోసం షార్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.