ఈ ఈవీఎంలకు ఏమైంది..? ఓట్లన్నీ బీజేపీకే..!

ఈ ఈవీఎంలకు ఏమైంది..? ఓట్లన్నీ బీజేపీకే..!

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్‌ జరుగుతున్న వేళ ఈవీఎంలో లోపాలపై విపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే పోలవుతోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. కేరళలోని కసారాగాడ్‌లో పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంలు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని అక్కడి కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఈవీఎంలపై కాంగ్రెస్‌ బటన్‌ నొక్కితే బీజేపీకి ఓటు పడినట్టు చూపిస్తోందని చెబుతున్నారు. ఇక.. చెర్తాలలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఇప్పటివరకు పోలైన ఓట్లన్నీ బీజేపీకే పడినట్టు ఈవీఎంలు చూపిస్తున్నాయని.. విషయం గుర్తించిన అధికారులు వాటిని మార్చారని వార్తలొస్తున్నాయి.