మహారాష్ట్రలో కూడా మొరాయించిన ఈవీఎంలు !

మహారాష్ట్రలో కూడా మొరాయించిన ఈవీఎంలు !

కొన్నిరోజుల క్రితం ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎం మిషన్లపై పెద్ద సంఖ్యలో పిర్యాదులు వచ్చాయి.  చాలా పోలింగ్ కేంద్రాల్లో మోషన్లు సరిగా పనిచేయని కారణంగా ఓటర్లు వెనుతిరగాల్సిన పరిస్థితి.  కొన్ని చోట్ల అయితే ఈవీఎంల కారణంగా అర్థరాత్రి వరకు పోలింగ్ జరిగింది.  ఇప్పుడే ఇదే పరిస్థితి మహారాష్ట్రలో కనిపిస్తోంది.  నాందేడ్, సోలాపూర్ ప్రాంతాల్లో చాలా ఈవీఎం మిషన్లు మొరాయించాయి.  దీంతో పోలింగ్ శాతం తగ్గుతోందని కాంగ్రెస్ పార్టీ ఈసీకి పిర్యాదు చేసింది.