ఈవీఎంల కలకలం.. అర్ధరాత్రి ఆటోలో తరలింపు!

ఈవీఎంల కలకలం.. అర్ధరాత్రి ఆటోలో తరలింపు!

ఓవైపు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై చర్చ జరుతున్న సమయంలో జగిత్యాలలో జరిగిన రెండు ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నెల 11వ తేదీన ఎన్నికలు ముగిస్తే... నిన్న రాత్రి సమయంలో ఆటోలో ఈవీఎంలను తరలించడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల తహసీల్దారు కార్యాలయం నుంచి మినీ స్టేడియంలో ఉన్న గోదాంకు ఆటోలో 10 ఈవీఎంలను తరలించారు. గోదాంకు తాళం వేసి ఉండటంతో వాటిని తిరిగి కార్యాలయానికి తరలించారు. మరోవైపు గత రెండు రోజుల క్రితం కూడా కారులో కొన్ని ఈవీఎంలను గోదాంకు తరలించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు జగిత్యాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే, అధికారులు మాత్రం అవగాహన కోసం ఉంచిన ఈవీఎంలనే గోదాంకు తరలించినట్టు చెబుతున్నారు. ఇక ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించిన జగిత్యాల జిల్లా కలెక్టర్‌.. విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.