మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ మృతిపై అనునామాలు..!!

మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ మృతిపై అనునామాలు..!!

భారత మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ చెన్నైలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.  అయన మృతిపై పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  వీబీ చంద్రశేఖర్ ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, ఈ క్రమంలో ఆయన మరణించారని అంటున్నారు.  అయితే, అయన ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే సాధారణంగానే మరణించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

వీబీ చంద్రశేఖర్ తమిళనాడు క్రికెట్ కు ఎన్నో సేవలు చేశారు.  భారత్ తరపున చంద్రశేఖర్ 7 వన్డేలు ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తన సత్తాను చాటారు.  1988-89 ఇరానీ కప్ మ్యాచ్ లో చంద్రశేఖర్ 56 బంతుల్లోనే సెంచరీ కొట్టారు.  చంద్రశేఖర్ దూకుడు గేమ్ కు ఒక నిదర్శనం అని బిసిసిఐ పేర్కొంది.  అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా తదితరులు సంతాపం తెలిపారు.