హోర్డింగ్ ఎక్కిన హోంగార్డు... భారీగా ట్రాఫిక్ జామ్

హోర్డింగ్ ఎక్కిన హోంగార్డు... భారీగా ట్రాఫిక్ జామ్

సర్వీస్‌ నుంచి తొలగించిన హోంగార్డులు హైదరాబాద్‌లో మెరుపు ఆందోళనకు దిగారు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లుగా సర్వీస్ చేయించుకొని... అకస్మాత్తుగా తొలగించి తమను రోడ్డున పడేశారని ఆరోపిస్తూ... 400 మంది మాజీ హోంగార్డులు ఖైరతాబాద్‌లో నిరసనచేపట్టారు. ఫ్లైఓవర్ పక్కనున్న హోర్డింగ్ ఎక్కి... తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ హోంగార్డుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు, ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.