అలాంటి అధ్యక్షుడు 'మా' కు ఉండటం మా దురదృష్టకరం..

అలాంటి అధ్యక్షుడు 'మా' కు ఉండటం మా దురదృష్టకరం..

నిన్న 'మా' డైరీ ఆవిష్కరణ సభ రసాభాసగా మారిన సంగతి తెలిసిందే.. చిరంజీవి, ఇతర పెద్దలు వేదిక మీద ఉన్న సమయంలో అలా జరగటం దురదృష్టకరమని నటుడు , మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. లెక్కలు తెలియని వాడు మా కు అధ్యక్షుడిగా ఉన్నారని  శివాజీ రాజా అన్నారు. పెద్దలన్న గౌరవం లేకుండా సభను రసాభాసం చేశారు. ఇది పెద్దలను పిలిచి అవమానించడం కాదా.. అని మండిపడ్డారు . 

ఇంత జరుగుతున్న ప్రెసిడెంట్ ఎం చేస్తున్నారు. మా ఎన్నికల సమయంలో ఒక రూపాయికి కూడా లెక్కతెలియని వ్యక్తి అధ్యక్షుడిగా ఉండటం  'మా' దురదృష్టమని శివాజీ అన్నారు. మేము ఉన్నపుడు మా పై తప్పుడు ఆరోపణలు చేసారు.. అవన్నీ అవాస్తవం అని తెలిసిన తర్వాత కనీసం క్షమాపణ చెప్పలేదు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కమిటీ ఉంది కమిటీ తన పని తాను చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాజశేఖర్ భావోద్వేగాలు గల వ్యక్తి 'మా' కు 10 లక్షలు విరాళం ఇచ్చిన ఎక్కడా బయట చెప్పుకోలేదు అన్నారు. వ్యక్తి గతంగా తాను ఎవ్వరిని దూషించడం లేదని ఎవరికీ వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని శివాజీ రాజా అన్నారు. అధ్యక్షుడు నరేష్ ఇప్పటివరకు ఎంత ఫండ్ కలెక్ట్ చేసారో చెప్పాలని శివాజీ డిమాండ్ చేసారు.