విశాఖలో మాజీ మంత్రి కుమారుడి కారు బీభత్సం..

విశాఖలో మాజీ మంత్రి కుమారుడి కారు బీభత్సం..

విశాఖ బీచ్‌ రోడ్డులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకెళ్లిన కారు... బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో అప్పలనాయుడు కారు నడుపుతున్నాడు. మాజీ పోలీసు అధికారి కుమారుడు మౌర్య కూడా ఆ కారులో ఉన్నాడు... ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారితో అప్పలనాయుడు, మౌర్య వాగ్వాదానికి దిగడంతో తోపులాట జరిగింది... పరిస్థితిని గమనించిన అప్పలనాయుడు అక్కడి నుంచి జారుకోగా... ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మౌర్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరిగింది.. అదే తెల్లవారుజామున జరిగితే పరిస్థితి దారుణంగా ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.