ఫోటోస్టోరీ: చల్లని గాలికి అల్లరి అందాలు.. అలా..!!

ఫోటోస్టోరీ: చల్లని గాలికి అల్లరి అందాలు.. అలా..!!

అందం అమ్మాయిలే నీలా ఉండే అన్నాడో సినిమా కవి.  సినీ కవి చెప్పడం కాదుగాని, అందం అంటే అమ్మాయే.. అమ్మాయి అంటే అందమే.  మరో ఛాన్స్ లేదు.  అందుకే మనసు కవి అందంపై ఎన్నో పాటలు రాశారు.  ఫాషన్ ప్రపంచం నుంచి ఎందరో సుందరాంగులు గ్లామర్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.  కొంతమంది సినిమా ఇండస్ట్రీకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.  సక్సెస్ అయ్యారు.  

ఇలా ఇండియన్ ఫ్యాషన్ నుంచి ప్రపంచ సుందరిగా ఎంపికైన సుందరి మనిషి చిల్లార్.  2017 లో ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకుంది.  గెలుచుకొని రెండేళ్ళైనా సినిమా ఇండస్ట్రీలోకి ఇంకా అడుగుపెట్టలేదు.  ఫ్యాషన్ సుందరి కాబట్టి ఆ ఫ్యాషన్ చుట్టూనే తిరుగుతున్నది.  రీసెంట్ గా ఈ అమ్మడు శ్రీలంక వెళ్ళింది.  బహుశా అక్కడ ఫోటో షూట్ కోసం వెళ్లి ఉంటుంది.  లంకలో ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి.  ఎన్నో బీచ్ లు ఉన్నాయి.  ప్రతిదీ అక్కడ అందంగానే ఉంటుంది.  అందుకే ఎక్కువ మంది సెలెబ్రిటీలు ఫోటో షూట్ ల కోసం అలా శ్రీలంక వెళ్తుంటారు.  

చార్టెడ్ ఫ్లైట్ లో ఈ అమ్మడు లంక వెళ్ళింది.  ఫ్లైట్ నుంచి లంకలో కాలు పెడుతుండగా చల్లని గాలి ఆమెకు స్వాగతం పలికింది.  మానుషీని చూడగానే గాలికి సైతం దూకుడు పెరిగింది అనుకుంటా.. జోష్ గా వీచింది.  అసలే ఫ్యాషన్ సుందరి.. ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత పాపులారిటీ.. రెడ్ కలర్ సూట్ వేసుకుంది.  గాలికి కోటు కాస్త పక్కకు జరిగింది.  ఇంకేముంది... ఆమె అందాలన్నీ కనువిందు చేశాయి.  కావాలంటే మీరు ఓ లుక్కేయండి.