కౌంటింగ్‌పై హైకోర్టుకు బోండా ఉమ..

కౌంటింగ్‌పై హైకోర్టుకు బోండా ఉమ..

సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ పై హైకోర్ట్ ని ఆశ్రయించారు టీడీపీ సీనియర్ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. తన నియోజకవర్గ పరిధిలో 16 ఈవీఎంలలో ఓట్ల తేడాపై వీవీ ప్యాట్స్ కౌంటింగ్ జరపాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు బోండా ఉమా... దీంతో ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది హైకోర్టు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానంలో బోండా ఉమాపై వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు 25 ఓట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.