టీడీపీ మాజీ ఎమ్మెల్యే సందేశం: కార్డులు పంచుతున్నా... పెళ్ళికి ఎవరూ రావొద్దు 

టీడీపీ మాజీ ఎమ్మెల్యే సందేశం: కార్డులు పంచుతున్నా... పెళ్ళికి ఎవరూ రావొద్దు 

పెద్ద పెద్ద నాయకుల ఇంట్లో పెళ్లి అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.  భారీ ఎత్తున పెళ్లిళ్లు చేస్తుంటారు. ప్రముఖులంతా పెళ్ళికి హాజరవుతుంటారు.  ఇదంతా కరోనాకు ముందు.  కరోనా వచ్చిన ఆతరువాత కాలం మారిపోయింది.  పరిమిత సంఖ్యలోనే పెళ్ళికి ఆహ్వానిస్తున్నారు.  సింపుల్ గా పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు.  టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన కుమార్తె వివాహాన్ని ఎలాంటి హడావుడి లేకుండా కొద్దిమంది అథితుల సమక్షంలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  జనవరి 2 వ తేదీన చింతమనేని ప్రభాకర్ కుమార్తె వివాహం జరగబోతున్నది.  ఈ వివాహానికి సంబంధించిన పెళ్లి కార్డును, స్వీట్ బాక్స్ ను పంచిపెడుతున్నాడు.  అయితే, బాక్స్ పై ఓ మెసేజ్ ను ముద్రించారు.  కరోనా నిబంధనలు కారణంగా నూతన వధూవరులను తమ ఇళ్ల నుంచే ఆశీర్వదించాలని కోరారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ఈ వివాహ ప్రచారం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.