బీజేపీలో చేరిన సోయం బాబురావు

బీజేపీలో చేరిన సోయం బాబురావు

మాజీ ఎమ్మెల్యే, ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాబురావు బీజేపీలో చేరారు. సోయం బాబురావు కాంగ్రెస్ నుండి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ రమేష్ రాథోడ్ కి టికెట్ కేటాయించింది. దీంతో సోయం బాబురావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బాబురావుకు బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి.