చానాళ్ళకి బయటకొచ్చిన రాధా...జగన్ కి టైం లేదా ?

చానాళ్ళకి బయటకొచ్చిన రాధా...జగన్ కి టైం లేదా ?

ఏపీ రాజధాని అమరావతిలోని తుళ్లూరులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతుల దీక్షకు టీడీపీ నేత వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు. చాలా విరామం తర్వాత రాధా ఆందోళనలో పాల్గొన్నారు. తుళ్లూరులో రైతులు.. మహిళల ఆందోళనలకు మద్దతు తెలిపిన వంగవీటి రాధా అనంతరం ఆ దీక్షా శిబిరంలో కూర్చున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రజా సంబంధిత కార్యక్రమంలో పాల్గొన్న వంగవీటి రాధా  మీడియాతో మాట్లాడారు. ఏ జిల్లాలో అయితే వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేశారో ఆ జిల్లాకే వెన్నుపోటు పొడిచారని రాధా విమర్శలు గుప్పించారు. వైసీపీని 30 రాజధానులైనా అనుకోనివ్వండి కానీ.. మాకు తెలిసి ఒకటే రాజధాని, ఒకటే రాష్ట్రమని వంగవీటి రాధా చెప్పుకొచ్చారు. అంతకముందు దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూడా రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. కాసేపు రైతులకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు.