హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం! తిరుపతి రాజధాని?

హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం! తిరుపతి రాజధాని?

నవ్యాంధ్ర రాజధానిపై చర్చ సాగుతూనే ఉంది. కృష్ణా నదిలో వరద పోటెత్తడంతో రాజధాని వ్యవహారం తెరపైకి రాగా.. నేతలకు వారివారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇవాళ నవ్యాంధ్ర రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ చింతా మోహన్... ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా తిరుపతి కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అమరావతిని వదిలి తిరుపతికి రావాలని కోరిన చింతా మోహన్.. ఇక, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, తిరుపతిని ఏపీ రాజధానిగా చేయాలని చింతా మోహన్ గతంలోనే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.