జగన్‌కు కూడా అదే గతి పడుతుంది

జగన్‌కు కూడా అదే గతి పడుతుంది

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు చాలా చురుకుగా పనిచేస్తున్నారు.  ఒకవైపు టీడీపీని, ఇంకొవైపు అధికార వైకాపాను విమర్శలతో ఏకిపారేస్తున్నారు.  మెళియాపుట్టిలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడిన మాజీ మంత్రి పి. మాణిక్యాలరావు చంద్రబాబు నాయుడును ఉదాహరణగా చూపుతూ జగన్‌కు హెచ్చరికలు చేశారు. 

గతంలో చంద్రబాబు జన్మభూమి కమిటీలపేరువు దోచుకుని వాటి మూలంగానే ఓటమిపాలయ్యారని, ఇప్పుడు జగన్ ఏర్పాటు చేస్తునం గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అదే పద్దతిలో ఉందని అన్నారు.  ఈ వ్యవస్థ వలన అవినీతికి తావుండని, అదే జరిగితే చంద్రబాబుకు పట్టిన గతే జగన్‌కూ పడుతుందని హెచ్చరించారు.