తిరుపతి చేరుకున్న శివప్రసాద్ భౌతికకాయం...ఎల్లుండి అంత్యక్రియలు

తిరుపతి చేరుకున్న శివప్రసాద్ భౌతికకాయం...ఎల్లుండి అంత్యక్రియలు

అనారోగ్యంతో మరణించిన చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ పార్థివ దేహం  చెన్నై నుంచి తిరుపతి తరలించారు. నగరంలోని ఎన్జీవోస్ కాలనీలో శివప్రసాద్ నివాసానికి డెడ్ బాడీని తీసుకొచ్చారు. తమ అభిమాన నేతకు నివాళులు అర్పించటానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చారు. కుటుంబ సభ్యులు శివప్రసాద్ భౌతిక కాయం చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  శివప్రసాద్ అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో ఆయన స్వస్థలం అగరాలలో సోమవారం నిర్వహిస్తారు.