మాజీ తహసీల్దార్‌ నాగరాజు చివరి వీడియో కాల్ ఫుటేజ్‌..ఏం చెప్పాడంటే

మాజీ తహసీల్దార్‌ నాగరాజు చివరి వీడియో కాల్ ఫుటేజ్‌..ఏం చెప్పాడంటే

మాజీ  ఎమ్మార్వో నాగరాజు చివరిసారి వీడియో కాల్ కలకలం రేపుతోంది. చివరి సారిగా చనిపోడానికి ముందు కుటుబంతో వీడియో కాల్ మాట్లాడిన నాగరాజు...రెండవ కేసులో ఏసీబీ కస్టడికి తీసుకోడానికి ముందు కేసు విషయంలో సంభాషణలు బయటపడ్డాయి. ఈ సంభాషణల్లో తాను ఏతప్పు చేయలేదు ప్రాపర్ గానే ఉన్నాయని చెప్పిన నాగరాజు...అవన్ని రికార్డ్స్ పరిశీలించే చేశామన్నాడు.  ఫాబ్రికేట్ సర్టిఫికెట్స్ కావు వెరిఫై చేసే చేశామన్న ఎమ్మార్వో...న్యాయవాదికి చెప్పి కోర్టులో తెలపాలని కుటుంబానికి విన్నవించుకున్నాడు. బెయిల్ పై బయటకు వచ్చాక కోర్టులో చూద్దాం అని కుటుంబ సభ్యులు హితవు పలికారు. కాగా..నాగరాజుది కచ్చితంగా హత్యేనని ఆయన భార్య స్వప్న పేర్కొన్నారు. నా భర్తను అన్యాయంగా కేసులో ఇరికించారని ఎన్టీవీతో నాగరాజు భార్య స్వప్న అన్నారు. నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు. చంచల్ గూడ జైల్ లో ఏదో జరిగింది అని ఆమె తెలిపారు.