రైల్వేజోన్ పై రాజకీయమా ..!

 రైల్వేజోన్ పై రాజకీయమా ..!

విశాఖ రైల్వే జోన్ ప్రకటనపై మాజీ కేంద్రమంత్రి, మాజీ ఎంపీ, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరీ తన అనందాన్ని వెలిబుచ్చారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల ఉత్తరాంధ్ర వాసుల ఆకాంక్షను కేంద్రం నెరవేర్చిందని సంతోషాన్ని వ్యక్తం చేసారు.సాంకేతిక ఇబ్బందులను  అధిగమించి రైల్వేజోన్ ను ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.అయితే దీనిని కొంతమంది రాజకీయం చేయడం శోచనీయమని పురంధేశ్వరీ ఆగ్రహం వ్యక్తం చేసారు.