బ్యాండ్ బాజా బారాత్... మళ్లీ వద్దనుకున్న స్టార్స్ మాజీ భార్యలు!

బ్యాండ్ బాజా బారాత్... మళ్లీ వద్దనుకున్న స్టార్స్ మాజీ భార్యలు!

బాలీవుడ్ లో మ్యారేజ్ తరువాత డైవోర్స్ ఉండటం ఆశ్చర్యమేం కాదు. అలాగే, చాలా సార్లు డైవోర్స్ తరువాత మళ్లీ మ్యారేజ్ కూడా కనిపిస్తుంది. కానీ, ఓ అయిదుగురు బీ-టౌన్ ఎక్స్ వైవ్స్ మాత్రం... డైవోర్స్ తరువాత మళ్లీ మ్యారేజ్ వద్దనుకున్నారు! భర్త దూరమైనా పిల్లలతో శేష జీవితం గడిపేస్తున్నారు. వారి హజ్బెండ్స్ మరో వైఫ్ తో వెడ్డింగ్ కి రెడీ అయినా... వారు మాత్రం... మింగిల్ అవ్వకుండా సింగిల్ గా మిగిలిపోయారు!

విడాకుల తరువాత పెళ్లి జోలికి వెళ్లని ఒకప్పటి స్టార్ వైఫ్ సుజానే ఖాన్. హృతిక్ కు దూరమయ్యాక ఇద్దరు కొడుకుల్ని పెంచుతూ సుజానే ఇప్పటికీ సింగిల్ గానే ఉంటోంది. సెకండ్ మ్యారేజ్ పై సెకండ్ థాట్స్ పెట్టుకోవటం లేదు. సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కూడా తలాఖ్ తరువాత ఫిర్ సే షాదీ అనలేదు. ఒక కొడుకు, కూతురు ఇద్దర్నీ పెంచి పెద్ద చేసింది. ఆమె గారాల పట్టి సారా ఇప్పుడు గార్జియస్ బీ-టౌన్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది. కానీ, అమృతా సింగ్ ఎక్స్ హజ్బెండ్ సైఫ్‌ మాత్రం కరీనాతో కళ్యాణానికి సై అన్నాడు. ఈ మధ్యే నాలుగో సారి తండ్రి అవుతూ, కరీనా రెండో కొడుక్కి డాడీ కూడా అయ్యాడు!

పెళ్లై, విడాకులు తీసుకున్న సైఫ్ కు కరీనా సెకండ్ వైఫ్ అయింది. కానీ, ఆమె అక్క కరిష్మా మాత్రం రెండో పెళ్లికి నై అనేసింది. ఒక పాప, బాబు ఉండటంతో భర్త సంజయ్ కపూర్ కు దూరంగా ఉంటూ వార్ని పెంచి పెద్ద చేస్తోంది. బాలీవుడ్ లో మరో కపూర్ ఫ్యామిలీ బోణీ కపూర్ ది. ఆయన కూడా శ్రీదేవిని పెళ్లాడటానికి ముందు ఫస్ట్ వైఫ్‌ మోనా కపూర్ కి డైవోర్స్ ఇచ్చాడు. ఈ తరం హీరో అర్జున్ కపూర్ మోనా కపూర్ తనయుడే. అర్జున్, అన్షులాని ఆమే పెంచి పెద్ద చేసింది. క్యాన్సర్ కారణంగా మోనా కపూర్ 2012లో మరణించింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ మొదటి పెళ్లి కూడా పర్ఫెక్ట్ గా ఫిట్ కాలేదు. ఆయన మొదటి భార్య రీనా దత్తా డైవోర్స్ తీసుకుని విడిపోయాక సింగిల్ గా ఉండిపోయింది. తన కూతురు, కొడుకుని చూసుకుంటూ రెండో పెళ్లి ఆలోచనే చేయలేదు. ఆమీర్ మాత్రం రెండో సారి నిఖాకు సిద్దపడి... కిరణ్ రావ్ ను తన బేగమ్ గా ఇంట్లోకి ఆహ్వానించాడు.