గ్రామ సచివాలయాల పరీక్షల తేదీలు ఖరారు 

గ్రామ సచివాలయాల పరీక్షల తేదీలు ఖరారు 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వారం రోజుల పాటు పరీక్షల నిర్వహిస్తామని, సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని మంత్రులు చెప్పారు. దాదాపు 3 నుంచి 5 వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలని, పశుసంవర్థక అసిస్టెంట్ పోస్టుల భర్తీపై దృష్టి సారించాలని బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి ఆదేశించారు.