ఓయూ ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు వాయిదా

ఓయూ ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్‌డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్‌డీ) పరీక్ష తేదీలను అధికారులు వాయిదా వేశారు. ఈమేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 18, 20 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ, వచ్చే నెల 5, 7 తేదీలలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో తెలుసుకోవచ్చని సూచించారు.