పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు?

పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు?

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసినా ఒపెక్‌ దేశాల నుంచి స్పందన లేదు. అమెరికా మార్కెట్లలో ఆయిల్‌ రిగ్స్‌ పెరిగినా ముడి చమురు ధరలు పెరగడంతో మార్కెట్‌ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. 2014 నవంబర్‌ తరవాత అంతర్జాతీయ మార్కెట్‌ ముడి చమురు ధరల బ్రెంట్‌ 75.53 డాలర్లకు, క్రూడ్‌ ధర 70 డాలర్లను దాటింది. మరోవైపు ఇతర కరెన్సీలతో డాలర్‌ విలువ పెరగడంతో భారత్‌ వంటి వర్ధమానదేశాలపై భారం మరింత పెరుగుతోంది. సాధారణంగా డాలర్‌ పెరిగితే చమురు ధరలు క్షీణిస్తాయి. అయితే ఇరాన్‌పై అమెరికా ఏక్షణమైనా ఆంక్షలు విధించవచ్చన్న వార్తలు, వెనిజులాలో పరిస్థితి దారుణంగా మారడంతో చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వెనిజులాలో అంతర్గత గొడవల కారనంగా ముడి చమురు తగ్గే అవకాశముంది. కాని అమెరికాలో ఉత్పత్తి పెరుగోతంది. ఈ నేపత్యంలో ఇరాన్‌ పై అమెరికా ఆంక్షలు విధిస్తుందన్న వార్తలే ధరలు ప్రభావితం చేస్తున్నాయి.
తగ్గించక తప్పదా?
ముడి చమురుపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే ప్రసక్తే లేదన్న ప్రభుత్వం ప్రస్తుతం సుంకాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో పోలింగ్‌ పూర్తయిన రోజు నుంచే తగ్గింపు అమల్లోకి రావొచ్చు. అంతకులోపు తగ్గిస్తే ఎన్నికల నియమావళి నిబంధనలను ఉల్లంఘించినట్లవుతుంది. కాబట్టి ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రభుత్వం  ఆగొచ్చు.ఈలోగా ముడి చమురు ధరలు తగ్గితే సరి లేదంటే సంఉకాన్ని తగ్గించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.