సిరాజ్ తన ఆటతోనే సమాధానం చెప్పాడు...

సిరాజ్ తన ఆటతోనే సమాధానం చెప్పాడు...

ఆసీస్ పర్యటనలో భారత పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడిన సిరాజ్ 13 వికెట్లు తీసాడు. అలాగే ఈ పర్యటనలో 5 వికెట్ హల్ సాధించిన ఏకైక భారత బౌలర్ గా నిలిచాడు. అయితే ఆసీస్ పై విజయంలో కీలక పాత్రా పోషించిన సిరాజ్ కుటుంభసభ్యులని ఎన్టీవీ ఇంటర్వ్యూ చేసింది. అందులో సిరాజ్ తమ్ముడు మాట్లాడుతూ... ఘనంగా సంబరాలు జరుపుకోవాల్సిన సందర్భం. కానీ... మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి.  ఇంతటి ఆనంద క్షణాల్లో మా నాన్న మాతో లేకపోవడం కలచివేస్తోంది. చిన్నప్పటి నుంచి సిరాజ్ ని క్రికెట్ వైపు ప్రోత్సహించారు.. ఈ క్షణంలో మా నాన్న ఉండి ఉంటే బాగుండు అనిపిస్తోంది. ప్లేయర్లు, ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నా... ఓర్పుగా సహనంతో ఉన్నాడు సిరాజ్ తన బౌలింగ్ తో సమాధానం చెప్పాడు అని అన్నారు. టీం ఇండియా కి ఆడాలన్న డ్రీమ్... సిరాజ్ కంటే మా నాన్న కే ఎక్కువగా ఉండేది అని తెలిపాడు.