ఆర్బీఐని తప్పుదోవ పట్టించిన చందా కొచ్చర్!!

ఆర్బీఐని తప్పుదోవ పట్టించిన చందా కొచ్చర్!!

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో చందా కొచ్చర్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తప్పుదోవ పట్టించినట్టు ఆరోపణ ఉంది. 2014లో మారిషస్ లోని హోల్డింగ్ కంపెనీ ఎస్సార్ స్టీల్ కి 365 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2,540 కోట్లు) రుణం ఇచ్చిన కేసులో ఆమెపై ఈ ఆరోపణ వచ్చింది. కేంద్ర బ్యాంక్ సైతం ఈ వ్యవహారంలో పలు అవకతవకలు జరిగినట్టు గుర్తించింది. 

ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తాపత్రిక అనేక పత్రాలు పరిశీలించి పరిశోధించి, దర్యాప్తు అధికారులు, ఇతర అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఎస్సార్ స్టీల్ మిన్నెసోటా ప్రాజెక్ట్ సామర్థ్య విస్తరణకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణం మంజూరు చేయడాన్ని ఆర్బీఐ ప్రశ్నించింది. ఎస్సార్ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు గడువు పొడిగించేందుకు బ్యాంకు తన అంగీకారం తెలిపినట్టు ఆర్బీఐ తెలిపింది. అంతే కాకుండా మొదటి లోన్ చెల్లించేందుకు మరో లోన్ ఇస్తూ పోయింది. ఎస్సార్ కి ఇస్తున్న రుణాన్ని 'సబ్-స్టాండర్డ్ అసెట్' (చెడిపోయే ఆస్తి) కేటగిరీలో చేర్చాల్సిందిగా ఆర్బీఐ ఐసీఐసీఐ బ్యాంక్ కి సలహా ఇచ్చింది.

సామర్థ్యం పెంచేందుకు అనుమతి ఇచ్చాం తప్ప ఎలాంటి అదనపు ఫండింగ్ ఇవ్వలేదని ఐసీఐసీఐ బ్యాంక్ సెప్టెంబర్ 2014లో ఆర్బీఐకి తెలియజేసింది. ఎస్సార్ గ్రూప్ ఐసీఐసీఐ బ్యాంక్ అతిపెద్ద రుణగ్రహీతల్లో ఒకటి. మారిషస్ కంపెనీకి లోన్ ఇచ్చిన క్రెడిట్ కమిటీలో చందా కొచ్చర్ కూడా ఉన్నారు. దర్యాప్తు అధికారుల ప్రకారం కొచ్చర్ కంపెనీ చట్టం 2013, సెబీ కింద తన కర్తవ్యాలను ఉల్లంఘించారు. ఆర్బీఐని తప్పు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారు. 

ఎస్సార్ గ్రూప్ కి వ్యతిరేకంగా 'రెడ్ ఫ్లాగ్' (ఫిర్యాదులు, నెగెటివ్ క్రెడిట్ రేటింగ్, త్రైమాసిక రాయితీ) తర్వాత కూడా ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్సార్ స్టీల్ మిన్నెసోటాకి రుణాలు ఇవ్వడం కొనసాగించింది. ఏప్రిల్ 2013లో బ్యాంక్, చందా కొచ్చర్ కు లిఖితపూర్వత ఫిర్యాదు వచ్చింది. అందులో ఎస్సార్ స్టీల్ మిన్నెసోటాకి ఏ ఆర్థిక సంస్థా డబ్బు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఆ తర్వాత కూడా బ్యాంకు ఎస్సార్ ను ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. ఏప్రిల్ 1 2014లో ఎస్సార్ స్టీల్ మిన్నెసోటా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) ఐసీఐసీఐ బ్యాంకుకు లేఖ రాశారు. అందులో ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ ఆడిట్ సమర్పించడంలో ఆలస్యం, ఎండ్ యూజ్ సర్టిఫికేట్, వడ్డీ సమయానికి చెల్లించలేకపోవడానికి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. 

ఈ సంఘటనలన్నీ 2011 నుంచి 2016 మధ్య కాలంలో జరిగినట్టు ఐసీఐసీఐ బ్యాంకుకి చెందిన ఒక ప్రతినిధి ఈమెయిల్ ద్వారా తెలిపారు. బ్యాంక్ తన బ్యాలెన్స్ షీట్ రిస్క్ ప్రొఫైల్ సరిదిద్దేందుకు గట్టి చర్యలు చేపట్టినట్టు చెప్పారు.