రోజూ అతిగా వ్యాయామం చేస్తున్నారా... ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి...

రోజూ అతిగా వ్యాయామం చేస్తున్నారా... ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి...

రోజు ఉదయం లేచిన తరువాత కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.  ఇలా చేయడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రోగాల బారి నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.  అయితే కొంతమంది గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు.  ఇలా చేయడం వలన ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

రోజూ అతిగా వ్యాయామం చేసే మహిళల్లో రుతుక్రమంకు సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  మహిళలు రోజుకు 90 నిమిషాలకు మించి వర్కౌట్ చేయడం వలన మహిళల్లో మానసిక ఆందోళన కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  రోజూ గంటల తరబడి కఠినంగా వ్యాయామం చేయడం కంటే, రోజు తేలికగా ఉండే వ్యాయామాలు చేయడం శరీరానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు.