ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు..?

ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు..?

సార్వత్రిక ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి... ఇప్పటికే ఆరు విడతలుగా పోలింగ్ ముగియగా... ఇవాళ చివరిదైన ఏడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది... 5 గంటల లోపు క్యూలైన్లలో చేరుకున్నవారికి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. అయితే, సాయంత్రం 5 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. వివిధ జాతీయ, ప్రాంతీయ సంస్థలతో పాటు. కొన్ని ప్రైవేట్ సర్వే ఏజెన్సీలు నిర్వహించన సర్వేల ఫలితాలను ఆయా ఛానెళ్లలో ప్రసారం కానున్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? కూటమియే ప్రధాని పీఠాన్ని ఎక్కబోతోందా? అనే చర్చ సాగుతోంది. ఇక గత నెల 11వ తేదీన మన రాష్ట్రంలో పోలింగ్‌ జరిగింది. అప్పటి నుంచి ఫలితాల కోసం ప్రజలు, నాయకులు నరాల తెగే టెన్షన్‌తో ఎదురు చూస్తున్నారు. అయితే, ఎంత ఆసక్తిగా ఎదురుచూసినా.. ఇవాళ వెలువడేది మాత్రం ఎగ్జిట్ పోల్స్ మాత్రమే.. అసలు ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్న సంగతి తెలిసిందే. ఇక కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ తారుమారైన సందర్భాలూ లేకపోలేదు. ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా వస్తే.. నిజమేనని... నెగిటివ్‌గా వస్తే మాత్రం.. ప్రజలు మావైపే ఉన్నారంటూ నేతలు వాదించడం మామూలు విషయమే.