ఎగ్జిట్‌ ఎఫెక్ట్‌: ఒక్క రోజులో రూ. 5.33 లక్షల కోట్లు!

ఎగ్జిట్‌ ఎఫెక్ట్‌: ఒక్క రోజులో రూ. 5.33 లక్షల కోట్లు!

మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్‌ పోల్‌ ఉత్సాహంతో మార్కెట్‌ సూచీలన్నీ పరుగులు తీశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ)లో లిస్టయిన షేర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఓకే ఒక్క రోజులో రూ. 5.33 లక్షల కోట్లు పెరిగింది. కంపెనీల మొత్తం షేర్ల మార్కెట్‌ విలువను మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ అంటారు. ఎన్డీఏ మళ్ళీ అధికారికంలోకి వస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాతో ఇవాళ నిఫ్టి 421 పాయింట్లు, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1422 పాయింట్లు పెరిగింది. గత శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 1,46,58,709  కోట్లు కాగా సోమవారం మార్కెట్‌ ముగిసే సమయానికి ఈ షేర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 1,51,86,312 కోట్లకు చేరింది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల వల్ల మార్కెట్‌పై స్వల్ప ప్రభావమే ఉందని, అయితే ఎన్డీఏ అధికారంలో మళ్ళీ రావడం ఖాయమన్న అంచనాలనే మార్కెట్‌కు జోష్‌ను తెచ్చాయని కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ పేర్కొంది.మార్కెట్‌ అంచనాలకు అనుగునంగా ఫలితాలు వచ్చే పక్షంలో మే 23 తరవాత మార్కెట్‌లో చిన్న ర్యాలీ వచ్చే అవకాశముందని కూడా ఆ సంస్థ పేర్కొంది.