'మహర్షి' రోజుకు ఐదు షోలు !

'మహర్షి' రోజుకు ఐదు షోలు !

భారీ అంచనాల నడుమ 'మహర్షి' చిత్రం 9వ తేదీన విడుదలకానుంది.  మొదటి రోజే సినిమా చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.  ఇప్పటికే మొదటి రోజు టికెట్లన్నీ బుక్ అయిపోయాయి.  దీంతో డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణలో అదనపు షోల కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరారు.  ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 9వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఉదయం 8 నుండి 11 మధ్యలో షో వేయడానికి అనుమతులిచ్చింది.  అంటే రోజుకు ఐదు షోలన్నమాట.  సినిమాపై క్రేజ్ చూస్తుంటే కలెక్షన్ల పరంగా సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.