'ఎఫ్ 2' అమెజాన్ రిలీజ్ డేట్ !

 'ఎఫ్ 2' అమెజాన్ రిలీజ్ డేట్ !

ఈ సంవత్సరం తెలుగులో విడుదలైన సినిమాల్లో 'ఎఫ్ 2' కూడా ఒకటి.  పెద్ద సినిమా మధ్యలో విడుదలై అన్నిటికంటే పెద్ద విజయంగా నిలిచిందీ సినిమా.  సంక్రాతి సినిమాలన్నీ దాదాపు థియేటర్ల నుండి వెళ్లిపోగా ఈ సినిమా మాత్రం చాలా చోట్ల హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది.  సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ ఎక్కువగా ఉన్నారు.  ఈ చిత్ర హక్కుల్ని సొంతం చేసుకున్న ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ఛానెల్ అమెజాన్ ప్రైమ్ వీడియో  ఫిబ్రవరి 11వ తేదీన చిత్రాన్ని రిలీజ్ చేయనుంది.  అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలు కాగా తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటించారు.  ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.