నైజాంను దున్నేస్తుందిగా..!!

నైజాంను దున్నేస్తుందిగా..!!

కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన మల్టీస్టారర్ సినిమా ఎఫ్2.  సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.  ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వందకోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోయింది.  తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణాలోని నైజాంలో ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుండటం విశేషం.  

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా నైజాంలో రూ.20 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది.  ఒక మీడియం బడ్జెట్ సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయంటే సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.  పెద్ద పెద్ద స్థాయి హీరోల సినిమాలు ఈ స్థాయిలో షేర్ సాధించడానికి చాలా కష్టపడుతుండగా.. ఈ స్థాయిలో వెంకటేష్.. వరుణ్ తేజ్ సినిమా కలెక్షన్లు సాధించింది అంటే అద్భుతమనే చెప్పాలి.  ఆదివారం రోజున ఈ సినిమా నైజాంలో రూ.96 లక్షల రూపాయల షేర్ ను వసూలు చేయడం విశేషం.