ఇది 100 కోట్ల నవ్వులు

ఇది 100 కోట్ల నవ్వులు

ఈ ఏడాది సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు వచ్చాయి.  అందులో రెండు పర్వాలేదనిపించగా.. ఎఫ్2 మాత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.  అంతేకాదు, ఈ సినిమా 11 రోజుల్లో రూ. 100 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసి రికార్డు సృష్టించింది. చాలా కాలం తరువాత టాలీవుడ్ లో వచ్చిన ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో థియేటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిసింది.  

వీకెండ్ లోనే కాకుండా వీక్ డేస్ లో కూడా సినిమా హౌస్ ఫుల్ గా రన్ అవుతుండటం విశేషం.  వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమాలో తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లు.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.  చాలా కాలం తరువాత నిర్మాత దిల్ రాజు ఓ మంచి హిట్ ను అందుకున్నాడు.