ఎఫ్ 2 షూట్ కెళ్ళింది 

ఎఫ్ 2 షూట్ కెళ్ళింది 

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ పేరుతో ఓ మల్టీ స్టారర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుండే ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ ఈనెల 21 వరకు నిరవధికంగా షూట్ జరుపుకోనుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రంలో ఒకరికి ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ కు గురై వ్యక్తిగాను, ఇంకొకరిని ఫన్నీగా ఉండే క్యారెక్టర్లో చూపించనున్నారు. ఈ ఏడాది చివరి కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసుకున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. మొదటి సారి వెంకీ, వరుణ్ తేజ్ లు కలిసి సినిమా చేస్తుండడంతో ఎఫ్ 2 పై మంచి హైప్ ఏర్పడింది.