వెంకీ రెచ్చిపోతే ఇలానే ఉంటుంది !

వెంకీ రెచ్చిపోతే ఇలానే ఉంటుంది !

ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో 'ఎఫ్ 2' విజేతగా నిలిచింది.  బోలెడంత ఫన్ నింపి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగు జనాన్ని ఉర్రూతలూగిస్తోంది.  తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 65 కోట్లకు చేరిన ఈ చిత్ర వసూలు ఓవర్సీస్లో 2 మిలియన్ డాలర్లను చేరుకుంది.  వెంకీ చాలా ఏళ్ల తర్వాత తన కామెడీ టైమింగ్ పవర్ ఏమిటో చూడపడంతో చిత్రం ఈ స్థాయి విజయాన్ని అందుకోగలిగింది.  ప్రేక్షకులు చాలా మంది మళ్ళీ మళ్లీ సినిమా చూడటానికి ప్రధాన కారణం వెంకీనే.  కొన్నేళ్లుగా సరైన స్క్రిప్ట్ దొరక్క డీలాపడిన వెంకీ సరైన కథ దొరికితే ఎలా చెలరేగిపోతాడో ఈ సినిమాతో చూపించేశాడు.  వెంకీకి తోడు వరుణ్ తేజ్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చడం సినిమాకు మరొక ప్లస్.