ఎఫ్2 కు సీక్వెల్ సిద్ధం అవుతుందా..?

ఎఫ్2 కు సీక్వెల్ సిద్ధం అవుతుందా..?

ఎఫ్2 సినిమా సంక్రాంతి స్పెషల్ గా వచ్చి హిట్ కొట్టింది.  అంచనాలకు మించి ఈ సినిమా హిట్ కావడంతో..యూనిట్ సంబరాలు చేసుకుంటుంది.  ఇప్పటికే ఈ సినిమా రూ.40 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  సంక్రాంతి తరువాత కూడా సినిమాకు కలెక్షన్లు వస్తుండటం విశేషం.  

సినిమా హిట్ కావడంతో.. శుక్రవారం సాయంత్రం సక్సెస్ మీట్ ను నిర్వహించారు.  హిట్ అవుతుంది అనుకున్నామని.. ఈ స్థాయిలో హిట్ అవుతుందని ఊహించలేదని దర్శక నిర్మాతలు చెప్పడం విశేషం. సినిమా చివర్లో ఎఫ్3 త్వరలో అని వేశారు.  అంటే దీని అర్ధం ఎఫ్2 సినిమాకు సీక్వెల్ ఉంటుందనే కదా.  ఈ విషయాన్ని దర్శకుడు కూడా చెప్పడంతో.. తప్పకుండా త్వరలోనే ఎఫ్ 3 సినిమాను తెరపై చూడొచ్చన్నమాట.  మరి ఈ సినిమాలో హీరోగా వెంకటేష్, వరుణ్ తేజ్ లు ఉంటారా లేదంటే మరొకరిని తీసుకుంటారో చూద్దాం.