న్యూఇయర్‌కు ఎఫ్3 స్పెషల్ పోస్టర్ రిలీజ్..

న్యూఇయర్‌కు ఎఫ్3 స్పెషల్ పోస్టర్ రిలీజ్..

టాలీవుడ్‌లో ఈ మధ్య మల్టీస్టారర్ సినిమాలు వరుస కడుతున్నాయి. హీరోలు పచ్చజెండాలు ఊపడంతో దర్శకనిర్మాతలు కూడా సాహసం చేయడానికి ముందుకు వస్తున్నారు. దీంతో తెలుగులో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు పెరిగాయి. నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలుగా వీ వచ్చింది. అదే తరహాలో గతేడాది సంచలన విజయం అందుకున్న ఎఫ్2కు సీక్వెల్ కూడా రెడీ అయిన విషయం తెలిసిందే. ఇందులో కూడా విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు చేసేందుకు సిదదమయ్యారు. దీనికి ఎఫ్3గా నామకరణం చేశారు. దీనిని కూడా అనిల్ రావిపుడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడు. అయితే నూతన సంవత్సర సందర్భంగా అన్ని సినిమాలు కొత్త పోస్టర్లను విడుదల చేశాయి. ఇప్పుడు ఎఫ్3 కూడా తన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో కేవలం హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కనిపిస్తున్నారు. వారితో పాటు గాలిలో ఎగురుతున్న కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్‌ను దర్శకుడు అనిల్ రావిపుడి తన ట్విటర్ ద్వారా విడుదల చేశాడు. ఈ పోస్టర్‌తో సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతోంది. ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కానుందని వార్తలు వినిసిస్తున్నాయి. దాంతో వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ఏ రేంజ్‌లో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఇస్తుందో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.