వరుణ్ తేజ్‌కు ఎఫ్3 స్పెషల్ విష్

వరుణ్ తేజ్‌కు ఎఫ్3 స్పెషల్ విష్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి అదే స్థాయిలో క్రేజ్ సంపాదించిన హీరో వరుణ్ తేజ్. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కేవలం కథలే కాదండీ ప్రతి సినిమాలో కూడా కొత్త పాత్రతో తనలోని సరికొత్త యాంగిల్‌ను చూపిస్తున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ నేడు 31వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఎఫ్3 సినిమాలో చేస్తున్నాడు. ఇంతకు ముందు వరుణ్, విక్టరీ వెంకటేష్ కలిసి చేసిన ఎఫ్2 ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దానికి సీక్వెల్‌గా ఎఫ్3 చేస్తున్నారు. ఇందులో కూడా ఎఫ్2లో చేసిన నటీనటులు రిపీట్ కానున్నారు. అయితే నుడు వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా ఎఫ్3 టీమ్ అభిమానులకు సరికొత్త పోస్టర్‌ను కానుకగా విడుదల చేశారు. దీనిని దర్శకుడు అనిల్ రావిపుడి ట్విటర్ ద్వారా వరుణ్‌ను విష్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో మరికొందరు ప్రముఖులు కూడా వరుణ్ తేజ్‌కు విషెస్ తెలిపారు. ఇక అభిమానులు వరుణ్ తేజ్ మీద ఉన్న ప్రేమను అతడి పోస్టర్ షేర్‌ చేస్తూ చూపుతున్నారు.