58 కోట్ల ఫేస్ బుక్ అకౌంట్స్ ?

58 కోట్ల ఫేస్ బుక్ అకౌంట్స్ ?

అతిపెద్ద సామజిక మాధ్యమం ఫేస్ బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 583 మిలియన్ అకౌంట్స్ ను డిలీట్ చేసినట్లు ప్రకటించింది. గడిచిన మూడు నెలల్లో ఈ డిలీట్ ప్రక్రియను చేపట్టింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నీక్ ను ఉపయోగించి ఆయా పేస్ బుక్ అకౌంట్స్ ను తొలగించినట్లు తెలిపింది. లైంగిక వేధింపులు, హింసాత్మక చిత్రాలు, తీవ్రవాద ప్రచారాలు లేదా ద్వేషపూరిత ప్రసంగం చేస్తున్న వారి అకౌంట్లను కమ్యూనిటీ గైడ్ లైన్స్ ను దృష్టిలో ఉంచుకుని డిలీట్ చేసింది. దీంతోపాటు 837 మిలియన్ల వివాద స్పద పోస్టులను తొలగించామని వివరించింది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా  బ్రీచ్‌ కుంభకోణం తరువాత  ఫేస్‌బుక్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. యూజర్ డేటా దుర్వినియోగం విచారణలో భాగంగా తమ ప్లాట్‌ఫాంపై దాదాపు  200 యాప్స్‌ను తొలగించినట్టు  ప్రకటించిన ఫేస్‌బుక్‌  తాజాగా   ఈ చర్య తీసుకోవడం విశేషం.