150 కోట్ల ఖాతాదారుల్ని అమెరికా తరలింపు

150 కోట్ల ఖాతాదారుల్ని అమెరికా తరలింపు
ఫేస్‌బుక్ డేటా లీకేజీపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా 'కేంబ్రిడ్జి అనలిటికా' ఉదంతం వెలుగులోకి రావడంతో ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉందా? అన్న అనుమానాలు అందరిలో రేకెత్తున్నాయి. అయితే తాజాగా ఫేస్ బుక్ కు సంబంధించి అందుతున్న సమాచారాన్ని బట్టి యూరోపియన్ చట్టాలకు లోబడి.. వాటి నిబంధలకు అనుగుణంగా నడుస్తున్న 150మందికి చెందిన ఆజా ఫేస్ బుక్ ఖాతాలను అమెరికా చట్టాల పరిదిలోకి తెచ్చేలా ఆయా ఖాతాలన్నింటినీ అటు తరలించనున్నారు. ఇప్పటివరకు యూఎస్ వెలుపల ఉన్న కెనడా, యూరోపియన్ యూనియన్, ఐర్లండ్ లలో ఉన్న వారి ఖాతాలన్నింటినీ మెయిన్ ఆపీస్ అయిన కాలిపోర్నియాకు తరలించనున్నట్లు వెల్లడౌతుంది. దాంతో పాటు ఆయా ఖాతాదారులు ఇక నుండి అమెరికా చట్టాల పరిదిలోకి రానున్నాయి. దీంతో ఖాతాదారుల భద్రతకు సంబధించి ఫేస్ బుక్ సీఈవో మార్క్ జు కర్ బర్గ్ పూర్తి భరోసాను వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.