కాంగ్రెస్ కి షాక్.. 687 పార్టీ పేజీలు తొలగించిన ఫేస్ బుక్

కాంగ్రెస్ కి షాక్.. 687 పార్టీ పేజీలు తొలగించిన ఫేస్ బుక్

భారతదేశ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కి సంబంధించిన 687 పేజీలు, అకౌంట్లను తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ నుంచి తొలగించినట్టు ఫేస్ బుక్ సోమవారం ప్రకటించింది. ఎన్నికలకు ముందు ఈ పేజీలలో అనధికార సమాచారం వ్యాపింపజేస్తూ, మోసపూరితంగా పరస్పర ప్రభావాన్ని పెంచుతున్నందుకు ఈ చర్యలు చేపట్టినట్టు చెప్పింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఈ పేజీల నుంచి అనధికార హెచ్చరికలు ఇస్తున్నారని ఫేస్ బుక్ తెలిపింది. 

ఫేస్ బుక్ చేపట్టిన ఈ చర్య కాస్త విచిత్రంగా కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. కొందరు వ్యక్తులు నకిలీ ఖాతాలు ఉపయోగించి తమ కంటెంట్ వ్యాపింప జేసేందుకు, తమ పోస్ట్ కి ఇంటరాక్షన్ పొందేందుకు అనేక గ్రూపుల్లో చేరినట్టు తమ దర్యాప్తులో గుర్తించినట్టు ఫేస్ బుక్ పేర్కొంది. ఈ పోస్టుల్లో స్థానిక వార్తలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ వంటి రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ పేజీల అడ్మిన్లు, అకౌంట్స్ ముఖ్యంగా లోకల్ న్యూస్, రాజకీయ అంశాలు..వీటిలో రాబోయే ఎన్నికలు, అభ్యర్థులపై అభిప్రాయాలను షేర్ చేస్తున్నట్టు ఫేస్ బుక్ తెలిపింది. ఈ పేజీలలో బీజేపీని విమర్శిస్తున్నారు. ఈ అకౌంట్లు కాంగ్రెస్ ఐటీ సెల్ కి సంబంధించినవని తమ సమీక్షలో తేలినట్టు ఫేస్ బుక్ చెప్పింది.