ఆ సోషల్ మీడియా యాప్స్ పేర్లు మారుతున్నాయా?

ఆ సోషల్ మీడియా యాప్స్ పేర్లు మారుతున్నాయా?

మనిషి లైఫ్ లో సోషల్ మీడియా ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పక్కర్లేదు.  సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి అకౌంట్స్ ఉంటాయి అనడంలో సందేహం అవసరం లేదు. సెలెబ్రిటీస్ మొదలు సామాన్యుల వరకు సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేస్తుంటారు.  ముఖ్యంగా పేస్ బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ లు.  ఈ మూడింటిలో అందరికి అకౌంట్స్ ఉంటూనే ఉంటాయి.  

వాట్సాప్, ఇంస్టాగ్రామ్ లను పేస్ బుక్ సంస్థ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  వీటిని కొన్న తరువాత పేస్ బుక్ అనేక మార్పులు చేసింది.  యూజర్ ఫ్రెండ్లీగా మార్చింది.  దీంతో వీటిని ఆపరేట్ చేయడం చాలా ఈజీ అయ్యింది.  ఇప్పటి వరకు ఈ రెండు స్వతంత్రంగానే వ్యవహరించాయి.  ఇకపై అలా కుదరదని పేస్ బుక్ చెప్తోంది.  వాట్సాప్, ఇంస్టాగ్రామ్ పేర్లలో స్వల్పంగా మార్పులు చేసేందుకు సిద్ధం అయ్యింది పేస్ బుక్ వాట్సాప్ ఫ్రమ్ పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ఫ్రమ్ పేస్ బుక్ అనే పేర్లతో వీటిని వ్యవహరించబోతున్నారు.  ఇకపై గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అనుకున్నా.. ఇదే పేరుతో డౌన్లోడ్ చేసుకోవాల్సిందే.