కేంద్రం కొత్త పథకం..ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏడాదికి 24 వేలు..నిజమెంత.?

కేంద్రం కొత్త పథకం..ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏడాదికి 24 వేలు..నిజమెంత.?

 ‘ప్ర‌ధానమంత్రి క‌న్యా ఆశీర్వాద్ యోజ‌న’ పేరుతో ఒక పథకం వచ్చినట్టు సోషల్ మీడియాలో మెస్సేజ్ లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పథకం కింద ఇంట్లో ఆడపిల్ల ఉన్నవాళ్లు అప్లై చేసుకుంటే ఏడాదికి రూ.24 వేలు అకౌంట్ లో పడతాయని మెసేజ్ లు వస్తున్నాయి. ఈ వార్త నిజమేనని చాలా మంది షేర్ కూడా చేస్తున్నారు. దాంతో నిజమేనేమో అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ మెసేజ్ పై (పీబీఐ)  ప్రెస్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో క్లారిటీ ఇచ్చింది. అసలు ‘ప్ర‌ధానమంత్రి క‌న్యా ఆశీర్వాద్ యోజ‌న’ పేరుతో ఎలాంటి పథకం లేదని స్పష్టం చేసింది. అలాంటి ఫేక్ మెసేజ్ లను ఎవరు నమ్మకూడదని అంతేకాకుండా ఫార్వర్డ్ చేయవద్దని సూచించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇలాంటి ఫేక్ సందేశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం సాధారణ విషయమైపోయింది. సైబర్ నేరగాళ్లు ఫేక్ మెసేజ్ లు పంపుతూ అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. దాంతో అలాంటి మెసేజ్ లను ఓపెన్ చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.