హీరోయిన్ డైసీ గురించి కొన్ని నిజాలు

హీరోయిన్ డైసీ గురించి కొన్ని నిజాలు

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ విదేశీ యువతిని ఎన్టీఆర్ కు జోడిగా తీసుకున్నారు.  ఎప్పుడైతే డైసీని హీరోయిన్ గా తీసుకున్నారో... ఆ మరుక్షణం నుంచే డైసీ ఎవరు.. ఏంటి అనే విషయాల గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.  

డైసీ ఎడ్గర్ జోన్స్.. హాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ థియేటర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోల ద్వారా ఆమె మంచి గుర్తింపు సాధించింది. ముఖ్యంగా ‘కోల్డ్ ఫీట్’ టీవీ షోలో జోన్స్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 1997లో మోస్ట్ పాపులర్ అయిన ఈ టీవీ షోకు ఎడ్గర్ జోన్స్ అదనపు ఆకర్షణ తెచ్చింది. 2017లో ఎడ్గర్ జోన్స్ ఎంట్రీతో ‘కోల్డ్ ఫీట్’ టీవీ షో రేటింగ్స్ అమాంతం పెరిగాయి. 

కోల్డ్ ఫీట్ లో డైసీ ఆకట్టుకుంది.  సహజసిద్ధంగా నటించి మెప్పించింది.  అలానే పాండ్ లైఫ్, వార్ ఆఫ్ ది వరల్డ్ టీవీ సీరీస్ లు ఆకట్టుకున్నాయి.  టివి సీరీస్ ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందినప్పటికీ మంచి సినిమాల్లో మాత్రం అవకాశాలు రాలేదు.  రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో అవకాశం రావడంతో డైసీ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.  

చదువులో డైసీ ఓ సాధారణ స్టూడెంట్ మాత్రమే.  టీచర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే సిగ్గుగా ఉండేదని ఒకానొక సందర్భంలో డైసీ పేర్కొంది.  ఐదేళ్ల వయసులోనే మొదటి నాటకం వేసిందట.  ఆమె నటనకు అందరు ఫిదా కావడంతో అప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నట్టు డైసీ చెప్పింది.  బ్రిటన్ లో నేషనల్ యూత్ థియేటర్ సంస్థలో స్థానం సంపాదించుకున్న డైసీ ప్రొఫెషనల్ నటిగా మారేందుకు ఆ థియేటర్ ఎంతగానో సహకరించినట్టు చెప్పింది.